News31st Jul 10:30 AMSunil Byrisetty1 min read

ఆగస్టు 15 నుంచి 'స్త్రీశక్తి'

రాష్ట్రంలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి రానుంది. మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి ప్రభుత్వం 'స్త్రీశక్తి' పేరు పెట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు

ఆగస్టు 15 నుంచి 'స్త్రీశక్తి'
రాష్ట్రంలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి రానుంది. మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి ప్రభుత్వం 'స్త్రీశక్తి' పేరు పెట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీచేసే టికెట్లపై 'స్త్రీశక్తి' అని ముద్రించనుంది. మహిళలకు 'జీరో ఫేర్ టికెట్' జారీ కోసం ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆర్టీసీ సిబ్బంది వినియోగించే టిమ్స్ యంత్రాలు, యూటీఎస్ సాఫ్ట్ వేర్ లోనూ మార్పులు చేసింది. మరోవైపు జీరో ఫేర్ టికెట్లు ఎలా జారీ చేయాలో తెలుపుతూ నేటి నుంచి సిబ్బందికి శిక్షణ అందించనుంది. మహిళలకు ఇచ్చే టికెట్ పై ఛార్జీ, ఇచ్చిన రాయితీ వివరాలు ముద్రించనుంది.
Andhra Pradesh news
Women Free Travel
Andhra Pradesh RTC
Sthree Shakti Scheme
Independence Day 2025
Zero Fare Ticket
ఉచిత ప్రయాణం
స్త్రీశక్తి పథకం
ఆర్టీసీ టికెట్లు
Scroll for the next article