News5th Mar 12:01 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వాన్ని నడిపిస్తోంది మద్యమే?
ఆంధ్రా ప్రభుత్వాన్ని నడిపిస్తోంది మద్యమేనా? అంటే రాజకీయ విశ్లేషకులు అవునని చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అప్పుల్లో వాటాలు భారీగా వచ్చాయి. తర్వాత వచ్చిన టీడీపీ,
ఆంధ్రా ప్రభుత్వాన్ని నడిపిస్తోంది మద్యమేనా? అంటే రాజకీయ విశ్లేషకులు అవునని చెబుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అప్పుల్లో వాటాలు భారీగా వచ్చాయి. తర్వాత వచ్చిన టీడీపీ, వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు కూడా అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి.
రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయంపై ఆధారపడుతోంది.
తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సైతం ఇదే స్పష్టం చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మద్యంపై వచ్చే ఆదాయం ఏకంగా 14.5 శాతం పెరిగింది.
మద్యం విక్రయాలు ఎక్కువగా చెప్పే తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో 6 శాతం పెరుగుదల ఉండగా.. ఏపీలో మాత్రం అత్యధికంగా 14.5 శాతం ఉంది.
మరో తెలుగు రాష్ట్రం, మద్యాన్ని సంప్రదాయంగా భావించే తెలంగాణలో 3. 5 శాతం మద్యం విక్రయాలు తగ్గాయి.
వ్యాట్, లైసెన్స్ ఫీజు, ఎక్సైజ్ డ్యూటీ ఇలా 3 రకాలుగా మద్యంపై ఆదాయం సమకూరుతుండగా..
ఆంధ్రాలో అత్యధికంగా ఉండటంతో మద్యమే ప్రభుత్వాన్ని నడిపిస్తోందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.