News1st Sep 04:59 PMSunil Byrisetty1 min read
సీపీఎస్ రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదు
ఏపీలో ప్రభుత్వాలు మారినా.. నాయకులు మారినా.. అధికారం మారుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు. సోమవ
ఏపీలో ప్రభుత్వాలు మారినా.. నాయకులు మారినా.. అధికారం మారుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు. సోమవారం ఏపీసీపీఎస్ పెన్షన్ మార్చ్ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం రైలు అయితే.. ఉద్యోగస్తులు ఇంజన్ లాంటి వారని కానీ ఈ రోజు ప్రభుత్వాలు తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల, ఉద్యోగస్తుల పట్ల అనుసరిస్తోన్న విధానాలు, వేధింపులతో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దినదినగండంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్థిక, ఉద్యోగ భద్రతతో పాటు పదవీ విరమణ తర్వాత పెన్షన్ భద్రత ఉంటుందన్న నమ్మకం ఉద్యోగస్తుల్లో పోయిందని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి ఉద్యోగులపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని.. ఉద్యోగుల హక్కులు అణిచివేతకు గురవుతున్నాయని రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.