Politics14th Nov 04:27 PMSunil Byrisetty1 min read

తమిళనాట ఏపీ పెట్టుబడుల చిచ్చు

తమిళనాడులో రాజకీయాలు ఆంధ్రా చుట్టూ తిరుగుతున్నాయి. తమిళనాట అధికార, ప్రతిపక్షాలు ఏపీ సీఎం చంద్రబాబు బ్రాండ్‌తో విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు విజయం సాధిస్తే, తమిళనాడు

తమిళనాట ఏపీ పెట్టుబడుల చిచ్చు
తమిళనాడులో రాజకీయాలు ఆంధ్రా చుట్టూ తిరుగుతున్నాయి. తమిళనాట అధికార, ప్రతిపక్షాలు ఏపీ సీఎం చంద్రబాబు బ్రాండ్‌తో విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు విజయం సాధిస్తే, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఓడిపోయారని, డీఎమ్‌కే అధినేత, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శించారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ రేసులో ఏపీ పరుగులు పెడుతుంటే, మీరేం చేస్తున్నారని విజయ్‌ని నిలదీశారు. తమిళనాడుకు రావల్సిన వేల కోట్ల పెట్టుబడులు, కంపెనీలు ఏపికి క్యూ కడుతున్నాయన్నారు. విశాఖ సీఐఐ సదస్సులో కియా అనుబంధ పరిశ్రమలు సుమారు 20 వేల కోట్లతో పెట్టుబడులకు ఎమ్‌ఓయూ కుదుర్చుకున్నాయి. ఇదే ఇప్పుడు తమిళనాడులో రాజకీయ దుమారం రేపుతోంది. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థలు హ్వాషిన్ , సియోన్, ఐవామెట్ అనంతపురంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఈ పెట్టుబడుల వ్యవహారం చర్చకు దారితీసింది. తమిళనాడుకు రావాల్సిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నది ఆయన విమర్శిస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో విజయ్‌ సర్కార్‌ విఫలం అయిందని, చంద్రబాబు ప్రభుత్వం దూసుకుపోతోందని స్టాలిన్‌ ఆరోపిస్తున్నారు.
Scroll for the next article