News18th Aug 10:46 AMSunil Byrisetty1 min read
ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం
ఆంధ్రాలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్
ఆంధ్రాలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని జీఎంఆర్‌కు ఆదేశించగా, ఆ మేరకు పనులు కొనసాగుతున్నాయి.
జులై నాటికే దాదాపు 84% పనులు పూర్తి అయ్యాయి. విమానాశ్రయానికి అనుబంధంగా 15 అంతర్గత రహదారులను నాలుగు లైన్లుగా విస్తరించేందుకు వీఎంఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందించింది. వీటికి రూ.390 కోట్లు కేటాయించగా, కనీసం 7 రహదారులు 2026 జూన్ నాటికి పూర్తయ్యేలా లక్ష్యాలు పెట్టుకుంది. ఇప్పటికే ఒక విమానంతో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అన్నీ షెడ్యూల్ ప్రకారం జరిగితే, వచ్చే ఏడాది జూన్ నెలలో భోగాపురం విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాలు ఎగరడం ప్రారంభమవుతాయి.