Sports12th Aug 09:06 AMSunil Byrisetty1 min read
అద్భుతమైన విజయాన్ని అందుకున్న అమరావతి రాయల్స్
మొదటి మ్యాచ్లోనే విజయం సాధించి మంచి దూకుడు మీదున్న అమరావతి రాయల్స్ రెండవ మ్యాచ్ లోనూ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వైజాగ్ క్రికెట్ స్టేడియంలో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ మ
మొదటి మ్యాచ్లోనే విజయం సాధించి మంచి దూకుడు మీదున్న అమరావతి రాయల్స్ రెండవ మ్యాచ్ లోనూ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వైజాగ్ క్రికెట్ స్టేడియంలో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ మధ్య ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన అమరావతి రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.మొదట బ్యాటింగ్ చేసిన తుంగభద్ర వారియర్స్ ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అమరావతి రాయల్స్ బౌలర్లలో మల్లికార్జున్, కార్తీక్ లు చెరో రెండు వికెట్లు తీయగా,అయ్యప్ప,వినయ్ కుమార్ లు తలొక వికెట్లు తీశారు.189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హనుమ విహారి టీం ఆదిలో కొంచం తడబడి వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అమరావతి రాయల్స్ టీం ను రాహుల్ (61) సందీప్(33) లు ఆదుకొనే ప్రయత్నం చేశారు.చివరిలో బ్యాటింగ్ దిగిన పాండురంగరాజు (42),ప్రసాద్(39) లు మెరుపులు మెరిపించి నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరానికి చేర్చారు.దీంతో అమరావతి రాయల్స్ పాయింట్స్ టేబుల్ ల్లో రెండవ స్థానానికి ఎగబాకింది.