News22nd Dec 12:05 PMSunil Byrisetty1 min read

ఆంధ్రా ట్యాక్సీ.. చౌకగా, సౌకర్యంగా!

ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్లు బుక్ చేసుకోవడానికి ప్రైవేటు యాప్‌లు ఉన్నట్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఓ పోర్టల్/ యాప్ రూపొందించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఈ మేరకు త్వరలోనే యాప్‌ను

ఆంధ్రా ట్యాక్సీ.. చౌకగా, సౌకర్యంగా!
ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్లు బుక్ చేసుకోవడానికి ప్రైవేటు యాప్‌లు ఉన్నట్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఓ పోర్టల్/ యాప్ రూపొందించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఈ మేరకు త్వరలోనే యాప్‌ను విడుదల చేస్తామని, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విజయవాడ దుర్గగుడి, భవానీ ద్వీపం, కృష్ణా నది తీరం వెంబడి ఆలయాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు చౌకగా, భద్రంగా రవాణా సేవలు అందించడానికి ఉపయుక్తంగా దీన్ని తీర్చిదిద్దారు. సందర్శకుల నుంచి స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ రుసుము డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఆంధ్రా ట్యాక్సీ యాప్తో మోసాలకు చెక్ పెట్టనున్నట్లు చెబుతున్నారు. సందర్శకులను చౌకధరల్లో సౌకర్యంగా, భద్రంగా తిప్పడమే ఈ యాప్ ఉద్దేశం. దీని ద్వారా పర్యాటకం వృద్ధి చెందుతుందని, వాహనదారులకు కచ్చితమైన ఉపాధి లభిస్తుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆంధ్రా ట్యాక్సీ పోర్టల్/ యాప్లో క్యాబ్, ఆటోలను వాట్సప్, ఫోన్కాల్, యాప్, క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మహిళల భద్రత దృష్ట్యా వాహనాల డేటా, బుకింగ్ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్లకు అందేలా యాప్ను రూపొందించారు.
Andhra Taxi
Government App
NTR District
Collector Lakshmeesha
Vijayawada
Tourism
Auto Services
ఆటో సేవలు
క్యాబ్ బుకింగ్
మహిళల భద్రత
చౌక రవాణా
ప్రభుత్వ పోర్టల్
Scroll for the next article