Education23rd Jul 09:30 AMSunil Byrisetty1 min read

ఆంధ్రా యూనివర్సిటీలో క్వాంటం కోర్సు

విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ క్వాంటం కంప్యూటింగ్‌ కోర్సు ప్రవేశపెట్టేందుకు ఏయూ సెనేట్‌ ఆమోదం తెలిపింది. ఈ కోర్సులో చేరేందుకు ఈఏపీసెట్‌ ద్వారా ప్రవేశా

ఆంధ్రా యూనివర్సిటీలో క్వాంటం కోర్సు
విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ క్వాంటం కంప్యూటింగ్‌ కోర్సు ప్రవేశపెట్టేందుకు ఏయూ సెనేట్‌ ఆమోదం తెలిపింది. ఈ కోర్సులో చేరేందుకు ఈఏపీసెట్‌ ద్వారా ప్రవేశాలు చేపట్టనుంది. సెనేట్‌ సమావేశంలో నూతన కోర్సు ప్రారంభానికి సభ్యులు ఆమోదం తెలిపారు. తొలి బ్యాచ్‌లో 30 మందికి అడ్మిషన్స్‌ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అతికొద్ది విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తున్న ఈ కోర్సును ఏయూలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Technology
Visakhapatnam
Andhra University Quantum Computing
B.Tech Quantum Course
EAPCET Admissions
AU Senate Approval
Quantum Valley
ఆంధ్రా యూనివర్సిటీలో క్వాంటం కోర్సు
Scroll for the next article