News24th Aug 03:07 PMSunil Byrisetty1 min read
ఆంధ్ర యువ సంకల్ప్ 2k25
అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువత కోసం ఒక అద్భుతమైన వేదిక సిద్ధమైంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగాకొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడానికి రాష్ట్
అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువత కోసం ఒక అద్భుతమైన వేదిక సిద్ధమైంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగాకొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర యువ సంకల్ప్ 2k25 పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేష్ యూట్యూబ్ అకాడమీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ఆధారంగా డిజిటల్ మారథాన్‌ను నిర్వహిస్తున్నాం అని తెలిపారు.
పోస్టర్లలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి, లేదా www.andhrayuvasankalp.com లో పేరు నమోదు చేసి, వీడియో లింక్ రూపంలో మీ ప్రతిభను అప్‌లోడ్ చేయాలని చూచించారు. ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 10 వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఆంధ్రా యువ సంకల్ప్ 2k25 డిజిటల్ మారథాన్ ద్వారా యువత ఆలోచనలు, కలలు, క్రియేటివిటీ ప్రపంచానికి తెలిపేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువతకు ఆహ్వానం పలికారు.