Politics8th Mar 06:37 PMSunil Byrisetty1 min read

నాడు ఒప్పుకోలేదు.. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నా.. భువనేశ్వరి గురించి చంద్రబాబు

‘‘నా భార్య భువనేశ్వరికి ఎన్టీఆర్ కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం రాలేదు. నేను చాలా కాలం కిందట హెరిటేజ్ కంపెనీని ప్రారంభించాను. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయాను. మంత్రిగా ఉంటూ వ

నాడు ఒప్పుకోలేదు.. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నా.. భువనేశ్వరి గురించి చంద్రబాబు
‘‘నా భార్య భువనేశ్వరికి ఎన్టీఆర్ కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం రాలేదు. నేను చాలా కాలం కిందట హెరిటేజ్ కంపెనీని ప్రారంభించాను. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయాను. మంత్రిగా ఉంటూ వ్యాపారం చేయకూడదనే తలంపుతో ఆమెను ఆ వ్యాపారం చూసుకోమని చెబితే ముందు అంగీకరించలేదు. ఆ తర్వాత ఆమె ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసిన తీరు చూసి నేనే ఆశ్చర్యపోయాను. కుటుంబాన్ని చూసుకుంటూ కుమారుడిని బాగా చదివించి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ వరకూ వెళ్లేలా చేసింది. ఎన్టీఆర్ ట్రస్టుతో పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నది. అందుకు ఆమెను నేను అభినందిస్తున్నాను. మీలో కూడా ఇలాంటి శక్తి దాగి ఉన్నదని నమ్ముతున్నాను. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రాణించాలని కోరుతున్నాను’’ అని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Cm Nara Chandrababu
Nara Bhuvaneswari
సీఎం నారా చంద్రబాబు
నారా భువనేశ్వరి
Scroll for the next article