TTD10th Sep 09:50 AMSunil Byrisetty1 min read
కాలినడకన తిరుమలకు కొత్త ఈవో
టీటీడీ నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నేడు టీటీడీ ఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. భక్తుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. 1984లో మొదట తిరుమలక
టీటీడీ నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నేడు టీటీడీ ఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
భక్తుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. 1984లో మొదట తిరుమలకు కుటుంబంతో పాటు వచ్చానని గుర్తు చేసుకున్నారు.
స్వామి దర్శనం కోసం ఏడు గంటలు ఎదురుచూసి దర్శనం చేసుకున్నానని చెప్పారు. సామాన్య భక్తుడిగా దర్శనం చేసుకున్నప్పుడు సామాన్యుల బాధలు తెలిశాయన్నారు. చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు విధుల్లో భాగంగా తరచూ తిరుమల దర్శనానికి వచ్చేవాడినని అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.