Entertainment30th Dec 12:59 PMSunil Byrisetty1 min read

విజయవాడలో అనిల్ రావిపూడి మూవీ ప్రమోషన్స్ హంగామా

మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడకు వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని, మెగాస

విజయవాడలో అనిల్ రావిపూడి మూవీ ప్రమోషన్స్ హంగామా
మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడకు వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని, మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం తన అదృష్టమని అన్నారు. చిరంజీవిలోని అద్భుత కామెడీ, డ్యాన్స్‌ను ఈ చిత్రంలో కొత్తగా చూపించామని వెల్లడించారు. లాస్ట్ 13 నిమిషాల్లో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారని చెప్పారు. నయనతార శశిరేఖ పాత్రలో జీవించిందని, న్యూ ఇయర్ రోజున సర్ప్రైజ్ ఉంటుందని తెలిపారు. మీసాల పిల్ల పాట 100 మిలియన్లు, శశిరేఖా పాట 30 మిలియన్ల వ్యూస్ సాధించాయని చెప్పారు. వినోదాత్మకంగా మెసేజ్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
Telugu Cinema
Nayanthara
Anil Ravipudi
Chiranjeevi
Shankar Varaprasad Movie
Vijayawada Promotions
Sankranti Release
ఇంద్రకీలాద్రి అమ్మవారు
టాలీవుడ్
మూవీ ప్రమోషన్స్
Scroll for the next article