News31st Jan 01:25 PMSunil Byrisetty1 min read

జంతు కొవ్వు అవశేషాలు నిజమే

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక నిబంధనలను సరళీకృతం చేసేలా కమిటీ వేసి నిబంధనలను నీరుగార్చిందని మండిపడ్డారు. నాట

జంతు కొవ్వు అవశేషాలు నిజమే
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక నిబంధనలను సరళీకృతం చేసేలా కమిటీ వేసి నిబంధనలను నీరుగార్చిందని మండిపడ్డారు. నాటి నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి ఆధారాలున్నాయన్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఈవో ల్యాబ్ కి శాంపిల్స్ పంపితే సెంట్రల్ ఫుడ్ టెక్నొలాజికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఎఫ్ టీఆర్ఐ), మైసూర్ కు పంపిస్తే కల్తీ జరిగిందని 2022లోనే తేల్చారని వివరించారు. ఆనాడే కెమికల్, బీసిస్టోస్టెరాల్, జంతు కొవ్వు, అవశేషాలు ఉన్నాయని నిర్ధారించిందన్నారు. 2022లో వైసీపీ ప్రభుత్వం సీఎఫ్ టీఆర్ఐ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి, ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిట్ ధ్రువీకరించిందని స్పష్టం చేశారు. 2022లో వైవీ సుబ్బారెడ్డికి పీఏగా పని చేసిన చిన్న అప్పన్న బోలేబాబా డెయిరీని సంప్రదించి, లీటర్ కి రూ. 25 ఇవ్వాలని డిమాండ్ చేశారని సిట్ ఆధారాలు సేకరించిందని గుర్తు చేశారు. ఇప్పుడు సిట్ నివేదికలో పశువుల కొవ్వు అవశేషాలు, ఫిష్ ఆయిల్ లేదని ఏ రిపోర్ట్ చెప్పిందో వైసీపీ చెప్పాలని సవాల్ చేశారు.
Andhra Pradesh politics
Animal Fat Residues
Tirumala Laddu Controversy
TTD Adulteration Case
Payyavula Keshav Statement
CFTRI Report 2022
దర్యాప్తు
వైసీపీ ఆరోపణలు
టీడీపీ వాదనలు
ఆహార కల్తీ అంశం
Scroll for the next article