News29th Aug 11:08 AMSunil Byrisetty1 min read
యర్రబాలెం సొసైటీ ఛైర్మన్ గా అంజయ్య
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్ గా బత్తినేని అంజయ్య బాధ్యతలు చేపట్టారు. సొసైటీ సెక్రటరీ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్ గా బత్తినేని అంజయ్య బాధ్యతలు చేపట్టారు. సొసైటీ సెక్రటరీ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకులు బత్తినేని అంజయ్య సొసైటీ ఛైర్మన్ గా, కృష్ణాయపాలెంకు చెందిన ఆవల శ్రీనివాసరావు డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల సంక్షేమానికి, సొసైటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని సొసైటీ ఛైర్మన్ అంజయ్య తెలిపారు. తన పదవీ నియామకానికి సహకరించిన నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి, ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అంజయ్య కు, డైరెక్టర్ ఆవల శ్రీనివాసరావు కు పలువురు కూటమి నేతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల ఉమా మహేశ్వరరావు, నీలం అంకారావు, ఆవల కిరణ్, ఆకుల పానకాలరావు, ఫిరోజ్ ఖాన్, కర్నాటి సత్యనారాయణ, చింతా జగన్మోహనరావు, జనసేన పార్టీ నాయకులు వాసా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.