Farmers30th Jul 09:09 AMSunil Byrisetty1 min read
ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ
ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ- పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. సచివాలయంలో
ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ- పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. రైతులకు ఆర్దికంగా చేయూతను అందించే లక్ష్యంతో సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల రూ.లు వంతున అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ కింద సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ పధకానికి సంబంధించి ఇంకా ఇ-కెవైసి, ఎన్సిపిఐ మ్యాపింగ్ కానివారు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఇ-కెవైసి, మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని చెప్పారు. ఈపధకం అమలుకు ఇంకా మరో మూడు రోజులు వరకూ సమయం ఉన్నందున ఈ రెండు అంశాలు పెండింగ్లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని ఆయన సూచించారు. భూమిలేని సిసిఆర్సి కార్డు కలిగిన కౌలు రైతులు ఇ-క్రాపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వారికి అక్టోబరు మాసంలో ఇచ్చే అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ నిధులు అందుతాయని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.