News23rd Jul 12:25 PMSunil Byrisetty1 min read

వర్షాల కోసం అన్నవరంలో ‘వరుణ యాగం’

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ‘వరుణ యాగం’ నిర్వహించనున

వర్షాల కోసం అన్నవరంలో ‘వరుణ యాగం’
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ‘వరుణ యాగం’ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. దేవస్థానంలో వైదిక కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు, పండితులతో ఈఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యాగ నిర్వహణ, ముహూర్తం, వైదిక క్రతువుల రూపురేఖలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా రైతాంగం సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, మంచి వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ యాగం చేపడుతున్నట్లు తెలిపారు. యాగం ముహూర్తానికి సంబంధించిన తేదీలు, కాలపట్టికను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Andhra Pradesh news
Annavaram
Varuna Yagam
Sri Veera Venkata Satyanarayana Swamy Temple
Rain fall
వైదిక క్రతువులు
పండితులు
ఈఓ నల్లం సూర్య చక్రధరరావు
జలాశయాలు
Scroll for the next article