Politics10th Jun 12:00 PMSunil Byrisetty1 min read
ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..!!
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రిగ్గి
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మీద తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్‌తోపాటు ఇండియా కుటమిలోని అన్ని పార్టీలు ఈసీ మీద ఈ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే తొలుత ఈ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం ప్రస్తుతం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర సహ పలు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ లోని ఓటరు రోలింగ్ నెంబర్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.