News16th Apr 11:29 AMSunil Byrisetty1 min read
ఖైదీ ఖర్చు రోజుకు రూ. 733.. ఏడాదికి రూ.2.67 లక్షలు!
ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఖైదీల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై నివేదిక విడుదలైంది. రాష్ట్రంలో ఒక్కో ఖైదీపై ఏడాదికి రూ.2.67 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు 'ఇండియన్ జస్టిస్ రిపోర్ట్-2025′ త
ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఖైదీల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై నివేదిక విడుదలైంది.
రాష్ట్రంలో ఒక్కో ఖైదీపై ఏడాదికి రూ.2.67 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు 'ఇండియన్ జస్టిస్ రిపోర్ట్-2025′ తెలిపింది.
వివిధ జైళ్లలో ఉన్న 7,200 మంది ఖైదీల్లో ఒక్కొక్కరికి రోజుకు రూ.733 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇది దేశంలోనే అత్యధిక ఖర్చని తెలిపింది.
తెలంగాణలో ఒక్కో ఖైదీపై ఏటా రూ.33,277 మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది.
6,500 మందిపై ఒక్కొక్కరికి రోజుకు రూ.91 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఏపీలో ఖైదీల కోసం రోజుకు చేస్తున్న ఖర్చు ఉపాధి హామీ కూలీల రోజువారీ సంపాదన కన్నా ఎక్కువ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి