Spiritual1st Nov 03:36 PMSunil Byrisetty1 min read

5 నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. నవంబరు 4న అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ

5 నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. నవంబరు 4న అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు నవంబరు 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు మత్స్యగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు ఉదయం 9.30 గంటలకు ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహిస్తారు. మొదటిరోజైన నవంబరు 5న ఉదయం 8.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. రెండో రోజైన నవంబరు 6న మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు.చివరిరోజైన నవంబరు 7న రాత్రి 8.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
Scroll for the next article