TTD29th Jun 01:30 PMSunil Byrisetty1 min read
టీటీడీకి ఈవీ బస్సులు.. కాలుష్యరహిత ప్రణాళిక
తిరుమలకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుమల- తిరుపతి మధ్య డీజిల్ బస్సుల స్థ
తిరుమలకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుమల- తిరుపతి మధ్య డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్తు బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 50 ఎలక్ట్రిక్ బస్సులు కనుమదారుల్లో తిరుగుతుండగా, మరో 350 బస్సులు విడతలవారీగా రానున్నాయి. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా స్కీమ్ కింద కేంద్రం రాష్ట్రానికి ఇప్పటికే 750 విద్యుత్తు బస్సులు కేటాయించింది. ఇందులోంచి 50 బస్సులు ‘తిరుమల- తిరుపతి’కి కేటాయించారు. ఇవి కాకుండా తిరుమలకు మరో 300 బస్సులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర గృహ, పట్ణణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాయగా, అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చింది. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర సాంకేతిక ఏర్పాట్లకు పరిశీలన చేస్తున్నారు.