News24th Jan 02:35 PMSunil Byrisetty1 min read
ఏపీకి మరో ఎయిమ్స్!
బిహార్, జమ్మూ కశ్మీర్ లో మాదిరిగా మరో ఎయిమ్స్ ను ఏపీకి మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ అన్నారు. వెనుబడిన రాష్ట్రాలైనందున మరో ఎయిమ్స్
బిహార్, జమ్మూ కశ్మీర్ లో మాదిరిగా మరో ఎయిమ్స్ ను ఏపీకి మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ అన్నారు. వెనుబడిన రాష్ట్రాలైనందున మరో ఎయిమ్స్ ను కేటాయించామని, మరో ప్రత్యేక పథకం కింద ఏపీకి గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నడపడం అందరికీ ఆమోదయోగ్యమని,
దురుద్దేశంతో దీనిపై విషప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
దీన్ని విద్యార్థులు గమనించాలని కోరారు. సి ఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలవల్ల
గడచిన 19 నెలల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ, ఐపీ, ల్యాబ్ టెస్టులు పెరిగాయన్నారు.
జీవితంలో వినోదం భాగమే కానీ, వినోదమే జీవితం కాదని విద్యార్థులకు హితవు పలికారు.
ఎయిమ్స్ ఇవ్వాల్సిన 10 ఎకరాలను త్వరలోనే కేటాయిస్తామన్నారు.