News21st Apr 03:45 PMSunil Byrisetty1 min read
శ్రీ పాదం పేరిట కృత్రిమ కాళ్ల ఉచిత పంపిణీ
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరో ప్రతిష్టాత్మక సర్వీస్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. తెనాలిలో జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా 3150 కార్యక్రమంలో, రోటరీ క్లబ్ మంగళగిరి, రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరో ప్రతిష్టాత్మక సర్వీస్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
తెనాలిలో జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా 3150 కార్యక్రమంలో, రోటరీ క్లబ్ మంగళగిరి, రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ సంయుక్తంగా కృత్రిమ కాళ్ల ఉచిత పంపిణీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
జిల్లా 3150 గవర్నర్ శరత్ చౌదరి, గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ ఎస్వీ రాంప్రసాద్ ఆవిష్కరించి మాట్లాడారు.
ప్రత్యేకమైన మోకీలు వ్యవస్థ కలిగిన 120 ప్రభ ఫుట్, కృత్రిమ కాళ్ళను కాలు కోల్పోయిన దివ్యాంగులకు ఉచితంగా ఇవ్వనున్నట్లు రోటరీ ప్రతినిధులు తెలిపారు.
ఈ కృత్రిమ కాలును ఉపయోగించి నడవడం, మెట్లు ఎక్కడం, కాలును మడిచి కూర్చోవడం కూడా సులభంగా చేసుకుంటారని తెలిపారు.
దివ్యాంగులు 7207403150 నెంబర్‌కు ఫోన్ చేసి వారి వివరాలను, ఫొటోలను జత చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలియజేశారు.
దివ్యాంగులకు ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రాతిపదికన, జూన్ 9 నుంచి 15 వరకు మంగళగిరి ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో జరిగే శిబిరంలో, కృత్రిమ కాళ్లు ఉచితంగా అందజేస్తామని తెలియజేశారు.