News16th May 05:15 PMSunil Byrisetty1 min read

వల్లభనేని వంశీపై మరో కేసు.. ఉక్కిరిబిక్కిరి!

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌కు పా

వల్లభనేని వంశీపై మరో కేసు.. ఉక్కిరిబిక్కిరి!
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ వంశీపై కేసు నమోదు చేశారు. గన్నవరంలో వంశీ అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ ఆయన అనుచరులు చేసిన అక్రమాల వివరాలు అందులో ఉన్నాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన మైనింగ్‌ అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. వరుస కేసులతో వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
YSRCP
New Cases on Vallabhaneni Vamsi
గన్నవరం నియోజకవర్గం
అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ వంశీపై కేసు నమోదు
100 కోట్ల విలువైన మైనింగ్‌
Scroll for the next article