Entertainment31st Dec 12:45 PMSunil Byrisetty1 min read
‘నా అన్వేషణ’ అన్వేష్‌పై మరో కేసు
‘నా అన్వేషణ’, ‘ప్రపంచ యాత్రికుడు’ పేరుతో యూట్యూబ్ చానల్స్ నిర్వహిస్తున్న యూట్యూబర్ అన్వేష్ నోటి దురద చిక్కులు తెచ్చిపెట్టింది. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై భక్తులు మండ
‘నా అన్వేషణ’, ‘ప్రపంచ యాత్రికుడు’ పేరుతో యూట్యూబ్ చానల్స్ నిర్వహిస్తున్న యూట్యూబర్ అన్వేష్ నోటి దురద చిక్కులు తెచ్చిపెట్టింది. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. తాజాగా యూట్యూబర్ అన్వేష్‌పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైజాగ్లోనూ అన్వేష్‌పై కేసు నమోదైంది. అటు ఆయన ద్రౌపదిని ఉద్దేశించి రేప్ అంటూ పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల గరికపాటి, సీతామాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పాడు.