News3rd Nov 01:31 PMSunil Byrisetty1 min read

'మురసు'పోక ముందే మరో తుపాను!

నవంబర్ నెల ఏపీని అల్లాడిస్తోంది. ఆర్నాబ్ దెబ్బ నుంచి కోలుకోకముందే మురసుతో ముంచెత్తింది. మురసును మర్చిపోకముందే మరో తూఫాన్ హడలెత్తిస్తోంది. నవంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో మరో తుపాను ఏ

'మురసు'పోక ముందే మరో తుపాను!
నవంబర్ నెల ఏపీని అల్లాడిస్తోంది. ఆర్నాబ్ దెబ్బ నుంచి కోలుకోకముందే మురసుతో ముంచెత్తింది. మురసును మర్చిపోకముందే మరో తూఫాన్ హడలెత్తిస్తోంది. నవంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా తుపాన్లు ఏర్పడే పరిస్థితులు ఉండొచ్చని తెలుస్తోంది. వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడుపైనా ఉండే అవకాశం ఉంది. తుపాను ఏర్పడటం, దాని దిశ, తీవ్రతపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు.
Scroll for the next article