News1st Nov 03:40 PMSunil Byrisetty1 min read
రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు
రాష్ట్రానికి పొంచి ఉన్న మరో ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షనిర్వహించారు. రాష్ట్రంపై ప్రభావం, వర్షాలు, గాలుల అంచనాలు, జలాశయాల పరిస్థితిపై ముఖ్యమ
రాష్ట్రానికి పొంచి ఉన్న మరో ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షనిర్వహించారు. రాష్ట్రంపై ప్రభావం, వర్షాలు, గాలుల అంచనాలు, జలాశయాల పరిస్థితిపై ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. మరో తుఫాన్ ముప్పు నేపథ్యంలో రేపటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుఫానుగా మారి, నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
నవంబరు 3న ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు. నవంబరు 3, 4 తేదీల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవాకశాలున్నాయి.