News24th Nov 12:37 PMSunil Byrisetty1 min read
మరో తుఫాన్ ముప్పు.. ఏపీ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. రానున్న 24 గంటల్లో మరో తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ ప్రకారం.. రానున్న 24 గం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. రానున్న 24 గంటల్లో మరో తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ ప్రకారం.. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది 24వ తేదీన వాయుగుండంగా, 26వ తేదీ నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లు సూచించింది. ఈ తుఫాన్ తీరం వైపునకు కదిలే అవకాశాలను పరిశీలిస్తుండగా, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మొదలవుతాయని, నేటి నుంచి వచ్చే వారం రోజుల పాటు తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావం కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వేగం పెరగవచ్చని, మత్స్యకారులు సముద్ర యాత్రకు వెళ్లవద్దని సూచించింది. 26వ తేదీ నుంచి తుఫాన్ ప్రభావం ఏపీలో మరింతగా ఉండవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.