News3rd Jan 05:39 PMSunil Byrisetty1 min read

మరో ఎన్ కౌంటర్... 12 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం అందడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. మరోసారి మావోయిస్టులపై

మరో ఎన్ కౌంటర్... 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం అందడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. మరోసారి మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. బీజాపూర్ జిల్లా దక్షిణ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో అటవీ ప్రాంతంలో దాగి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రతా బలగాలు కూడా వెంటనే ప్రతిస్పందించడంతో రెండు వైపులా ఎదురుకాల్పులు జరిగాయి.
Encounter
Maoists
Chhattisgarh
South Bastar
Bijapur District
DRG
Security Forces
గాలింపు చర్యలు
కాల్పులు
అటవీ ప్రాంతం
అంతర్గత భద్రత
Scroll for the next article