Mobiles23rd Nov 11:25 AMSunil Byrisetty1 min read
మార్కెట్‌లోకి మరో భారత స్మార్ట్ ఫోన్ కంపెనీ
స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో మరో దేశీయ కంపెనీ ప్రవేశించింది. ఇండ్‌కాల్ టెక్నాలజీస్ సంస్థ నూతనంగా వాబుల్ అనే స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగానే వాబుల్ వన్ ప
స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో మరో దేశీయ కంపెనీ ప్రవేశించింది. ఇండ్‌కాల్ టెక్నాలజీస్ సంస్థ నూతనంగా వాబుల్ అనే స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగానే వాబుల్ వన్ పేరిట తన తొలి స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. వాబుల్ వన్ ఫోన్‌లో 6.67 ఇంచుల ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ప్రీమియం లుక్ కోసం ఫోన్ మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా ఉంది. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. గూగుల్‌కు చెందిన ఏఐ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను, బ్లోట్ వేర్‌ను అందించడం లేదని, క్లీన్ ఆండ్రాయిడ్ ఓఎస్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను 47 గంటల పాటు కాలింగ్‌కు, 24 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్‌కు ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 22 రోజుల వరకు స్టాండ్ బై టైమ్‌ను అందిస్తుంది.