News29th Oct 05:07 PMSunil Byrisetty1 min read

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పరిశ్రమ!

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. అనేక ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు స

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పరిశ్రమ!
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. అనేక ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో ఒక గ్రీన్‌ఫీల్డ్ చమురుశుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బీపీసీఎల్ మరియు ఆయిల్ ఇండియా కంపెనీల మధ్య ఒప్పందం ద్వారా దక్షిణ భారతదేశంలోనే ప్రపంచ స్థాయి రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ ప్లాంట్‌ను నిర్మించే దిశగా కీలక మైలురాయి పడింది. BPCL, OIL ఈ ప్రాజెక్టు కోసం ఐదేళ్లలో దాదాపు రూ. 96,862 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
Andhra Pradesh
BPCL
Oil India
Petrochemical Complex
Greenfield Project
Investment
Industrial Development
Refinery
ప్రైవేట్ కంపెనీలు
మౌలిక సదుపాయాలు
ఆర్థిక వృద్ధి
Scroll for the next article