National31st Oct 10:28 AMSunil Byrisetty1 min read
అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టం!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV-F18 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ద
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV-F18 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా 2,232 కిలోల బరువున్న NVS-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. NVS-03 ఉపగ్రహం భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ NavICలో భాగంగా పనిచేయనుంది. దేశ భూభాగంతో పాటు సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలో స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ సేవలను అందించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఉపగ్రహంలో స్వదేశీ అటామిక్ క్లాక్‌తో పాటు ఇతర అటామిక్ క్లాక్‌లను అమర్చారు. ఇప్పటికే ఉన్న L5, S-బ్యాండ్ సిగ్నళ్లతో పాటు L1 సిగ్నల్‌ను కూడా అందించనుంది. దీనివల్ల నావిగేషన్ సేవలకు మరింత విస్తృతమైన రిసీవర్ అనుకూలత లభించనుంది.