News11th Nov 10:21 AMSunil Byrisetty1 min read

బాబోయ్ ట్రావెల్ బస్సులు.. మంటల్లో మరో బస్సు

ప్రైవేట్ ట్రావెల్ బస్సులు హడలెత్తిస్తున్నాయి. తాజాగా మరో బస్సు మంటల్లో కాలి బూడిదైంది. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ

బాబోయ్ ట్రావెల్ బస్సులు.. మంటల్లో మరో బస్సు
ప్రైవేట్ ట్రావెల్ బస్సులు హడలెత్తిస్తున్నాయి. తాజాగా మరో బస్సు మంటల్లో కాలి బూడిదైంది. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద చోటుచేసుకుంది. విహారీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరింది. బస్సు పిట్టంపల్లి వద్దకు చేరుకోగానే ఇంజిన్ భాగం నుంచి మంటలు రావడం డ్రైవర్ గమనించారు. వెంటనే బస్సును నిలిపివేసి, ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో వారంతా క్షణాల్లో బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి, పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Private Bus Accident
Vihari Travels
Fire Incident
Hyderabad Vijayawada Highway
Nalgonda District
Chityala Mandal
పిట్టంపల్లి
బస్సు మంటలు
ప్రయాణికులు సురక్షితం
అగ్నిమాపక సిబ్బంది
Scroll for the next article