Politics2nd Mar 06:53 PMSunil Byrisetty1 min read

మరో ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

28 లక్షల 62 వేల కుటుంబాలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేసిన రెవెన్యూ యంత్రాంగం. సుమోటోగా రెవెన్యూ అధికారులే 34 లక్షల 37 వేల కుటుంబాల డేటాను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ

మరో ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
28 లక్షల 62 వేల కుటుంబాలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేసిన రెవెన్యూ యంత్రాంగం. సుమోటోగా రెవెన్యూ అధికారులే 34 లక్షల 37 వేల కుటుంబాల డేటాను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. విఆర్వోలు ఇంటింటికెళ్లి శాశ్వత కులధ్రవీకరణ పత్రాలు అందజేశారు. స్కూళ్లు, కాలేజీల్లో ప్రవేశాలకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు, ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేందుకు కులధ్రువీకరణ పత్రాలు ఉపయోగపడతాయి. ఇక ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ కులధ్రువీకరణ పత్రాల కోసం తిరగాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా, ఎపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడక్కడే కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు.
CM Chandrababu Naidu
AP Govt
Andhra Pradesh
AP News
Latest News
Telugu News
సీఎం చంద్రబాబు నాయుడు
AP ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ న్యూస్
తాజా వార్తలు
తెలుగు వార్తలు
Scroll for the next article