News11th Oct 12:27 PMSunil Byrisetty1 min read

విజయవాడను మోడల్ గా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ అభివృద్ధి నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతి రాజ

విజయవాడను మోడల్ గా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ అభివృద్ధి నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతి రాజ్ (NIRDPR), కేశినేని ఫౌండేషన్ మధ్య శనివారం హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఒప్పందంపై ఎన్ఐఆర్డిపిఆర్ తరఫున సీనియర్ కన్సల్టెంట్ డా. మొహమ్మద్ ఖాన్, కేశినేని ఫౌండేషన్ తరఫున విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి మోడల్‌గా మార్చి, దేశానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌గా నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం గ్రామీణాభివృద్ధి, ఉపాధి సృష్టి, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం వంటి అంశాల్లో సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నాం,” అని పేర్కొన్నారు.
Andhra Pradesh
Vijayawada
Kesineni Sivanath
Kesineni Foundation
NIRDPR
Rural Development
Women Empowerment
Skill Development
మోడల్ నియోజకవర్గం
విజయవాడ అభివృద్ధి
పార్లమెంటు నియోజకవర్గం
Scroll for the next article