News3rd Nov 03:35 PMSunil Byrisetty1 min read
రాజస్థాన్లో మరో ప్రమాదం.. 10 మంది మృతి
రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న రాజస్థాన్లో టెంపో, బస్సు ఢీకొని దాదాపు 20 మంది మరణించగా.. నేడు రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక డంపర
రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న రాజస్థాన్లో టెంపో, బస్సు ఢీకొని దాదాపు 20 మంది మరణించగా.. నేడు రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక డంపర్ ట్రక్కు కారణంగా 10 మంది మృతి చెందగా, సుమారుగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఈ డంపర్ ట్రక్కు ఒక కారును, ఆ తర్వాత మరో నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా 10 మంది అక్కడికక్కడే మరణించారు. అలాగే సుమారుగా 40 మంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.