Notifications17th May 11:06 AMSunil Byrisetty1 min read
పదో తరగతి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల విడుదల
ఏపీలో SSC పరీక్షల రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ దరఖాస్తులు పాఠశాలల లాగిన్‌లో 24.04.2025 నుండి 01.05.2025 వరకు అందుబాటులో ఉంచబడ్డాయి. దీనికి సంబంధించి 66,421 జవాబు పత్రాలు రీ-వెర
ఏపీలో SSC పరీక్షల రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ దరఖాస్తులు పాఠశాలల లాగిన్‌లో 24.04.2025 నుండి 01.05.2025 వరకు అందుబాటులో ఉంచబడ్డాయి. దీనికి సంబంధించి 66,421 జవాబు పత్రాలు రీ-వెరిఫికేషన్ మరియు రీ-కౌంటింగ్ కోసం విద్యార్థులచే దరఖాస్తు చేశారు. 66,421 జవాబు పత్రాలలో, మొత్తం 47,484 జవాబు పత్రాల ఫలితాలు విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మిగిలిన ఫలితాలు కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ ఫలితాలు పాఠశాలల లాగిన్‌లో అందుబాటులో ఉంచబడతాయి. సంబంధిత ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్ చేసి, ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసిన వెంటనే సంబంధిత విద్యార్థులకు సాఫ్ట్‌కాపీ/హార్డ్‌కాపీ రూపంలో అందజేయాలని డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి కోరారు.