Education13th Jun 12:06 PMSunil Byrisetty1 min read
అగ్రికల్చర్ డిప్లొమో కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
అగ్రికల్చర్ డిప్లొమో కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సత్య ప్రియలలిత తెలిపారు. పదవ తరగతి, తత్సమాన పరీక్షలలో ఉత్తీర
అగ్రికల్చర్ డిప్లొమో కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సత్య ప్రియలలిత తెలిపారు. పదవ తరగతి, తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణులైన వారు, ఇంటర్మీడియట్ ఫెయిలైన విద్యార్థులు, మద్యలో ఆపేసిన వారు 2025-26 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాం వారు కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులైన ఆసక్తి కలగిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకోవడానికి https://angrau.ac.in లేదా www.angrau.ac.in వెబ్సైట్ను సందర్శించాలని, మరిన్ని వివరాల కొరకు 08671 - 254499 నెంబర్లలో సంప్రదించాలని డాక్టర్ సత్య ప్రియలలిత తెలిపారు.