News18th Jul 09:11 AMSunil Byrisetty1 min read

‘చేనేత’లో నెంబర్ వన్ గా ఏపీ

చేనేత రంగంలో దేశంలో ఏపీని నెంబర్ వన్ గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్.సవిత తెలిపారు. నాలుగు రోజుల పాటు సాగిన భారత్ టెక్స్ 2026లో మూడు ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఢిల్

‘చేనేత’లో నెంబర్ వన్ గా ఏపీ
చేనేత రంగంలో దేశంలో ఏపీని నెంబర్ వన్ గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్.సవిత తెలిపారు. నాలుగు రోజుల పాటు సాగిన భారత్ టెక్స్ 2026లో మూడు ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026లో ఏపీ చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పనే లక్ష్యంగా పలువురు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో భేటీ అయ్యారు. హవాక్ గ్రూప్ ఆఫ్ ఎండీ ప్రవీణ్ సంగ్వాన్ తదితర పెట్టుబడిదారులతో మంత్రి సవిత ఏపీలో టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడుల గురించి చర్చించారు. ప్రతి నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో నేతన్నలకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఏపీలో చేనేత రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చేనేత రంగంలో ఏపీని నెంబర్ వన్ గా నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.
Andhra Pradesh
Handloom
Bharat Tex 2026
S Savitha
Textiles
MSME Parks
Textile Investment
చేనేత రంగం
పెట్టుబడులు
టెక్స్‌టైల్ రంగం
తెలుగు వార్తలు
Scroll for the next article