News20th Jul 05:01 PMSunil Byrisetty1 min read
ప్రత్యేక విద్యార్థుల్లో ఒలింపిక్ స్ఫూర్తి
ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల నుంచి 2032 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం పదిమంది క్రీడాకారులు ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు వెళ్లాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అన్నారు.
ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల నుంచి 2032 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం పదిమంది క్రీడాకారులు ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు వెళ్లాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అన్నారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారికి తగిన శిక్షణ, అవకాశాలు కల్పించేందుకు సమగ్ర శిక్ష కృషి చేస్తుందని తెలిపారు. సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్, పీఎం శ్రీ, సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం మూడు రోజుల రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీలను అగిరిపల్లిలోని హీల్ ప్యారడైజ్‌లో సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థుల విజయాన్ని ప్రస్తావిస్తూ, సాధారణ వ్యక్తులు కూడా చేయడానికి వెనుకాడే సాహసాన్ని ఈ విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. ఆ విజయానికి పూర్తి క్రెడిట్ విద్యార్థులకే చెందుతుందని పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు ఏ విషయంలోనూ ఇతరుల కంటే తక్కువ కాదని, తాము కూడా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరనే నమ్మకంతో ముందుకు సాగాలని సూచించారు.