News25th Mar 12:36 PMSunil Byrisetty1 min read

అప్పులకుప్పగా ఏపీ.. తెలంగాణ కన్నా ఎక్కువ!

ఆంధ్రప్రదేశ్ అప్పులకుప్పగా మారింది. తెలంగాణ కన్నా ఏపీలోనే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5.62 లక్షల కోట్

అప్పులకుప్పగా ఏపీ.. తెలంగాణ కన్నా ఎక్కువ!
ఆంధ్రప్రదేశ్ అప్పులకుప్పగా మారింది. తెలంగాణ కన్నా ఏపీలోనే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో అప్పులు 34.70 శాతం ఉంటాయన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2023–24)లో జీఎస్డీపీలో అప్పులు 34.58 శాతమని చెప్పారు. మరోవైపు తెలంగాణకు మొత్తం రూ. 4,42,298 కోట్ల అప్పు ఉందని, అప్పుల విషయంలో దేశంలో టీజీ 24వ స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. గత ఆరు సంవత్సరాలలో 10,189 ఐటీ కంపెనీలు కొత్తగా ప్రారంభమయ్యాయి. ఐటీ రంగం విస్తరిస్తున్నప్పటికీ, 3,369 సంస్థలు నష్టాల్లోకి వెళ్లి మూతపడినట్లు వెల్లడించారు.
Telangana
AP
Debt
కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి
Scroll for the next article