Politics19th Aug 04:18 PMSunil Byrisetty1 min read
పంచాయతీల వారీగా ఓటర్ల గుర్తింపు!
ఏపీలో స్థానిక సందడి మొదలైంది. గ్రామ పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి, ప్రత్యేక జాబితాలను రూపొందించే ప్రక్రియకు షెడ్యూల్ వచ్చేసింది. ఈనెల 20వ తేదీ వరకు ప్రత్యేకంగా ఇం
ఏపీలో స్థానిక సందడి మొదలైంది. గ్రామ పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి, ప్రత్యేక జాబితాలను రూపొందించే ప్రక్రియకు షెడ్యూల్ వచ్చేసింది.
ఈనెల 20వ తేదీ వరకు ప్రత్యేకంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లనుగుర్తిస్తారు. 21 నుంచి 22వ తేదీ వరకు సేకరించిన వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో సంబంధిత వర్గాలను స్పష్టంగా మార్కింగ్ చేస్తారు. 23న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితానుప్రచురిస్తారు.
24 నుంచి 26వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 27 నుంచి 31 వరకు అభ్యంతరాలను పరిశీలించి విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు.
సెప్టెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు గ్రామ సభలలో ఈ జాబితాలనుసమర్పించి ధ్రువీకరిస్తారు. 5న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించిన తుది ఓటర్ల జాబితానుఅధికారికంగా తయారు చేసి ప్రచురిస్తారు.