News20th Sep 09:21 AMSunil Byrisetty1 min read

ఏపీలో 13 గంటల పని విధానానికి ఓకే!

ఏపీలో పని గంటల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అమల్లో ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని 13 గంటలకు పెంచారు. రాత్రి షిఫ్టుల్లో మహిళలతోనూ పని చేయించుకునేందుకు వీలుగా చట్టంలో

ఏపీలో 13 గంటల పని విధానానికి ఓకే!
ఏపీలో పని గంటల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అమల్లో ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని 13 గంటలకు పెంచారు. రాత్రి షిఫ్టుల్లో మహిళలతోనూ పని చేయించుకునేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం నాలుగు బిల్లులను ఆమోదించారు. ఫ్యాక్టరీల చట్టం 1948ను రాష్ట్రానికి వర్తించేలా సవరణలు చేసే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. చట్టంలోని 54వ సెక్షన్లో కార్మికుడు పది గంటలకు మించి పనిచేయరాదని పేర్కొంటూనే ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌ అనుమతితో 13 గంటల వరకూ పని చేయించుకునేందుకు అనుమతించారు. మధ్యలో ఆరు గంటలకు ఒకసారి అరగంట విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. ఒక వారంలో మొత్తం 60 గంటలకు మించి పనిచేయించరాదన్నారు. సెక్షన్‌ 65లోని సబ్‌సెక్షన్లు 2, 3లో సాధారణ పని ఒత్తిడిని అధిగమించేందుకు అవసరమైతే పని గంటలు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
Andhra Pradesh
Work Hours Policy
13 Hour Workday
Labor Law Amendment
Night Shifts for Women
Assembly Bills
Factories Act 1948
AP Government Decision
Labor Reforms
Employment Policy
కార్మికుల హక్కులు
ఓవర్ టైమ్ నియమాలు
Scroll for the next article