Sports23rd Aug 05:05 PMSunil Byrisetty1 min read

ఏపీ ఆర్చర్ గణేష్ మణిరత్నం గోల్డ్ మెడల్

కెనడాలోని విన్నిపెగ్‌లో ఈ నెల 17 నుంచి 24 వరకూ జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ 2025లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. అండర్-21 కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత ఆర్చర్లు కు

ఏపీ ఆర్చర్ గణేష్ మణిరత్నం గోల్డ్ మెడల్
కెనడాలోని విన్నిపెగ్‌లో ఈ నెల 17 నుంచి 24 వరకూ జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ 2025లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. అండర్-21 కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత ఆర్చర్లు కుశల్ దళాల్, మిహిర్ అపర్, గణేష్ మణిరత్నం గోల్డ్ మెడల్ సాధించి దేశ ప్రతిష్ఠను ఉన్నత స్థానంలో నిలిపారు. ఈ జట్టు ఫైనల్‌లో జర్మనీని షూట్‌ఆఫ్‌లో ఓడించి ఈ విజయాన్ని అందుకుంది. అలాగే, అండర్-18 కాంపౌండ్ టీమ్ విభాగంలో మోహిత్ దగర్, యోగేష్ జోషి, దేవాన్ష్ సింగ్‌లు కూడా అమెరికాపై 224-222 స్కోరుతో గోల్డ్ మెడల్ సాధించారు. సందర్భంగా శాప్ ఛైర్మన్ రవినాయుడు భారత జట్టుకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ ఆర్చర్ గణేష్ మణిరత్నంకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. "గణేష్ మణిరత్నం సాధించిన గోల్డ్ మెడల్ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. క్రీడల పట్ల అతని అసక్తి, పట్టుదల, కఠోర శిక్షణలే ఈ విజయానికి నిదర్శనం" అని రవినాయుడు పేర్కొన్నారు.
India
Sports News
Ganesh Maniratnam
World Archery Youth Championship
India Gold
AP Archer
Winnipeg 2025
Compound Archery
Team Proud Moment
ఏపీ ఆర్చర్ గణేష్ మణిరత్నం గోల్డ్ మెడల్
Scroll for the next article