News25th Aug 04:21 PMSunil Byrisetty1 min read
27,28 తేదీల్లో అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సమావేశం
ఈనెల 27,28 తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సమావేశం కానుందని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలియజేశారు. ఈ కమిటీ
ఈనెల 27,28 తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సమావేశం కానుందని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలియజేశారు. ఈ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల(పబ్లిక్ అండర్ టేకింగ్స్(పిఎస్ యులు)కు సంబంధించి గత ఐదేళ్ళ వార్షిక నివేదికలు, జనరల్ యాక్టివిటీలను సమీక్షించ నుందని పేర్కొన్నారు.27వ తేది గురువారం ఉ.10 గం.లకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో సమగ్ర శిక్ష,ఎపి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజిమెంట్ లిమిటెడ్ లపైన,మధ్యాహ్నం 2గం.లకు ఎపి స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటి పైన తదుపరి ఎపి ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఇడబ్ల్యుఐడిసి)లపైన అసెంబ్లీ కమిటీ సమీక్షిస్తుందని సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలియజేశారు. 28వ తేది ఉ.10గం.లకు ఎపి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఎపిఐఐసి),ఎపి స్టేట్ రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్ఆర్టీసి), ఎపి స్టేట్ హేండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటి (ఆప్కో)లపై కమిటీ సమీక్షిస్తుందన్నారు.