News10th Aug 11:41 AMSunil Byrisetty1 min read

17 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఆరు అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి రెండేళ్ల పాలన, ఎల్‌నినోపై అ

17 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఆరు అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి రెండేళ్ల పాలన, ఎల్‌నినోపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ఉండనుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 17న ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు ఏపీ శాసన మండలి ప్రారంభం కానుంది.
Andhra Pradesh Politics
AP Assembly
Assembly Sessions
August 17
Chandrababu Naidu
కూటమి ప్రభుత్వం
ఎల్ నినో
ఏపీ ప్రభుత్వం
శాసనసభ
శాసన మండలి
అమరావతి
Scroll for the next article