Politics7th Mar 01:53 PMSunil Byrisetty1 min read
టార్గెట్ వైసీపీ.. కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధం?
ఏపీలో గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి భారీ స్కామ్ జరిగినట్టు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే ఏపీబీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని సీఐడీ అరెస్ట్ చేయగా.. బ
ఏపీలో గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి భారీ స్కామ్ జరిగినట్టు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఇప్పటికే ఏపీబీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని సీఐడీ అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై ఆయన విడులయ్యారు.
అయితే ఈ కేసులో వైసీపీలోని బడా నేతలే టార్గెట్ గా లోతైన విచారణ చేస్తోంది.
వైసీపీ హయాంలో ఫిల్లింగ్ స్టేషన్లలో అక్రమాలు, డిస్టలరీలు, మద్యం డిపోల ఏర్పాటుకు సంబంధించి రూ.60 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఈ కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడుగా పేరున్న ఒక రాయలసీమ ప్రాంత ఎంపీని బుక్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. తద్వారా వైసీపీని మరింత ఇరుకున పెట్టాలని ప్రణాళిక అని తెలుస్తోంది.