Politics8th Aug 03:47 PMSunil Byrisetty1 min read

వైసీపీకి కేంద్రం మద్దతు ప్రచారం అవాస్తవం

ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ప్రధాని సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. ట్రంప్ టార

వైసీపీకి కేంద్రం మద్దతు ప్రచారం అవాస్తవం
ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ప్రధాని సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. ట్రంప్ టారిఫ్ వల్ల ఆక్వా రైతుల ఇబ్బందులు ప్రధానికి దృష్టికి తీసుకెళ్లానని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ప్రధాని చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు, ఇతర వర్గాల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఏపీలో పార్టీ అభివృద్ధిపై రోడ్ మ్యాప్‌ను ప్రధానికి వివరించానన్నారు. హర్ ఘర్ తిరంగాను ప్రతి గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. వైసీపీకి, ఆ పార్టీ కార్యక్రమాలకు మా పార్టీ మద్దతు లేదని స్పష్టం చేశారు. వైసీపీకి కేంద్రం మద్దతు ఉందన్న ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పారు. వైసీపీ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోందని మాధవ్ స్పష్టం చేశారు.
AP BJP
PM Modi
PVN Madhav
Aqua Farmers
Trump Tariffs
YSRCP
Har Ghar Tiranga
Political Meeting
BJP Roadmap
Central Government Support
Andhra Politics
Anti-Corruption Campaign
కేంద్రం మద్దతు
రాజకీయ భేటీ
Scroll for the next article