News3rd Sep 01:44 PMSunil Byrisetty1 min read

ఏలూరులో ఛాయ్ పే చర్చ

ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ హేలాపురి(ఏలూరు)లో జరిగిన ఛాయ్ పే చర్చలో కీలక అంశాలపై మాట్లాడారు. ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్ భారత్ అనుసంధానం ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలి

ఏలూరులో ఛాయ్ పే చర్చ
ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ హేలాపురి(ఏలూరు)లో జరిగిన ఛాయ్ పే చర్చలో కీలక అంశాలపై మాట్లాడారు. ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్ భారత్ అనుసంధానం ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. జూట్ పరిశ్రమ సమస్యలపై స్పందిస్తూ, ప్లాస్టిక్ మిక్స్‌డ్ ఉత్పత్తుల వల్ల సాంప్రదాయ జూట్ పరిశ్రమ నష్టపోయిందని, దీనికి పరిష్కారం కోసం కేంద్రం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఏలూరు నిమ్మ మార్కెట్‌కి అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు అవసరమని, పామాయిల్, కోకో, కొబ్బరి రైతులను ఆదుకుంటామని తెలిపారు. యువత నిరుద్యోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విశాఖలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రధానమంత్రి కౌశల్య యోజన, విశ్వకర్మ యోజన వంటి పథకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. కొత్త విద్యా విధానం ద్వారా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మాధవ్ స్పష్టం చేశారు.
Andhra Pradesh Politics
P.V.N. Madhav
BJP
Chai Pe Charcha
Eluru
Health Services
Ayushman Bharat
Jute Industry
Traditional Industry
Farmer Support
Youth Employment
Skill Development
యువత ఉపాధి
స్కిల్ డెవలప్మెంట్
ప్రధానమంత్రి కౌశల్య యోజన
విశ్వకర్మ యోజన
విద్యా సంస్కరణలు
ఉపాధి అవకాశాలు
Scroll for the next article