News17th Dec 05:46 PMSunil Byrisetty1 min read

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ బీజేపీ భేటీ

ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, రాష్ట్ర

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ బీజేపీ భేటీ
ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏపీ బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన సంక్షేమ పథకాలు, సుపరిపాలన విధానాలను ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తున్న తీరు ప్రజలకు వివరిస్తూ ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు అమిత్ షాకు వివరించారు. దీనితోపాటు ఏపీకి సంబంధించి అభివృద్ధి అంశాలపై అమిత్ షా తో చర్చించారు. అనంతరం బిజెపి కేంద్ర కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ ను ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్, బిజెపి మంత్రులు మర్యాదపూర్వకంగా కలసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలోని పలు స్టేట్ హైవే లను నేషనల్ హైవేలుగా మార్పు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు.
Andhra Pradesh
Amit Shah
AP BJP
PVN Madhav
Bhupathiraju Srinivasa Varma
Satya Kumar Yadav
పార్లమెంట్ భవనం
బీజేపీ కేంద్ర నాయకత్వం
జాతీయ రహదారులు
Scroll for the next article