Politics1st Mar 06:50 PMSunil Byrisetty1 min read

పర్యాటక పెట్టుబడుల కోసం మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ పర్యటన

సుస్థిర, బాధ్యతాయుత, సమగ్ర, పర్యావరణహిత పర్యాటక విధానాలతో అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 4 నుండి 6 వరకు జర్మనీలో జరిగే ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సుకు హ

పర్యాటక పెట్టుబడుల కోసం మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ పర్యటన
సుస్థిర, బాధ్యతాయుత, సమగ్ర, పర్యావరణహిత పర్యాటక విధానాలతో అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 4 నుండి 6 వరకు జర్మనీలో జరిగే ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సుకు హాజరవుతున్నానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జర్మనీ లోని బెర్లిన్ ఎక్స్ పో సెంటర్ సిటీ వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఐటీబీ సదస్సుకు హాజరయ్యే పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని, స్థానికంగా ఉన్న అవకాశాలు,వనరులు చూసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తానని తెలిపారు. ప్రపంచ పర్యాటక చిత్రపటంలో ఏపీని ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు,వేగవంతమైన పర్యాటకాభివృద్ధికి జర్మనీ వేదికగా నిలుస్తుందని భావిస్తున్నానన్నారు.
ap budget
kandula durgesh
janasena party
deputy cm pawan kalyan
కందుల దుర్గేష్
జనసేన పార్టీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Scroll for the next article